కోర్టులో గ్యాంగ్‎స్టర్ హత్య.. లాయర్లుగా వచ్చిన దుండగులు

V6 Velugu Posted on Sep 24, 2021

ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ మన్ గోగిపై ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ సహా మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. జితేందర్ ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. న్యాయవాదుల వేషధారణలో ఉన్న ఇద్దరు దుండగులు కోర్టు ఆవరణలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్ తరలించామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం: 

నేను జనంలో ఒకడ్ని.. వెయ్యి మందితో సెక్యూరిటీ అవసరమా?

గర్భిణులకు కరోనా వ్యాక్సిన్​.. పుట్టబోయే పిల్లలకు యాంటిబాడీలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను రాత్రికి రాత్రే విశ్వనగరం చేయలేం


 

Tagged Delhi, attack, killed, shoot, Rohini court, , Gangster Jitendra Gogi

Latest Videos

Subscribe Now

More News