అక్కసుతోనే FCI అధికారులతో రైస్ మిల్లులపై దాడులు

అక్కసుతోనే FCI అధికారులతో రైస్ మిల్లులపై దాడులు

రైసు మిల్లుల్లోఎఫ్ సీఐ చేస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్ వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తనిఖీల పేరుతో ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలిగించి రైతులు రోడ్లమీదకు వచ్చేలా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గోడౌన్ ను ఆయన ప్రారంభించారు. ఎన్ని షరతులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో కేంద్రం... FCI అధికారులతో రైస్ మిల్లులపై దాడులు చేయిస్తోందన్నారు గంగుల. అవసరమైతే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక వెరిఫికేషన్ చేయాలని చెప్పారు. మొత్తం 2 వేల 900 మిల్లుల్లో  ఒకటి, రెండు మిల్లులు తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్