ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్: గంగుల

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్: గంగుల


కరీంనగర్: గాడ్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్​డే వేడుకలను కరీంనగర్ సిటీలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ‌ కేక్ కట్ చేశారు. అనంతరం గంగుల మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా ‌రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారనిన తెలిపారు. ప్రధానంగా ఐటీ రంగంలో హైదరాబాద్ ను అగ్రగామిగా నిలబెట్టారని, అర్బన్ డెవలప్ మెంట్ లో ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.