హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబోడ కాలనిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి.. అడ్డొచ్చినవారిపై దాడికి దిగి.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు నీచులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎర్రబోడ కాలనీలోని బీరప్ప గుడి మెట్లపై బీర్ సేవించి, అక్కడే బాటిల్స్ పడేసి రెచ్చిపోయారు హల్చల్ చేశారు దుండగులు. పార్క్ చేసి ఉన్న అద్దాలు ధ్వంసం అడ్డొచ్చినవారిపై దాడికి దిగారు.
ఈ విషయమై ప్రశ్నించిన యజమానితో దురుసుగా ప్రవర్తించారు నిందితులు. అంతే కాకుండా మాకు పగలకొట్టాలని అనిపించింది.. పగలకొట్టామని ఎదురు సమాధానం ఇచ్చారు నిందితులు. ఎక్కువ మాట్లాడితే కారు మొత్తం తగలబెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు గంజాయి బ్యాచ్. ఈ ఘటనపై పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు స్థానికులు.
అయితే.. కేసులు నమోదు కాకుండా లీడర్లు సముదాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.ఈ విషయంపై ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదంటూ మండిపడుతున్నారు స్థానికులు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారని.. పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని.. వెకిలి సైగలతో హింసించారని ఆవేదనకు గురవుతున్నారు మహిళలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.
