గంజాయి సాగు చేసిన ఇద్దరికి నాలుగేండ్ల జైలు శిక్ష 

గంజాయి సాగు చేసిన ఇద్దరికి నాలుగేండ్ల జైలు శిక్ష 

నిర్మల్, వెలుగు : గంజాయి సాగుచేసిన నిర్మల్ రూరల్ మండలానికి చెందిన ఇద్దరికి నాలుగేండ్ల జైలు శిక్ష తోపాటు, జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ముగ్జి గ్రామస్తులైన గుమ్ముల పోశెట్టి(50), జుట్టు శ్రీనివాస్(36) 2016లో తమ వ్యవసాయ భూమిలో పసుపు పంటతోపాటు గంజాయి మొక్కలను సాగుచేశారు. సమాచారం తెలుసుకున్న నిర్మల్ రూరల్ పోలీసులు తనిఖీలు చేసి, 10 కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

వారిని అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా.. ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ కేసు వివరాలను పరిశీలించారు. వారికి నాలుగేండ్ల కఠిన జైలు శిక్షతోపాటు, చెరో రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.