పెబ్బేరులో గంజాయి ముఠా అరెస్ట్

పెబ్బేరులో గంజాయి ముఠా అరెస్ట్

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులతో పాటు, వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసిన నలుగురు యువకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ ధాబా సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో డులు నిర్వహించి, బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ కుమార్, బబ్లు కుమార్ సింగ్‌‌‌‌లను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు ధీరజ్ ఠాకూర్‌‌‌‌ను అరెస్ట్ చేసి, 64 గ్రాముల గంజాయిని, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని  తెప్పించి ఇక్కడ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న అజిత్ నాయుడు, రాకేశ్, వెంకటేశ్​, శివను అరెస్టు అదుపులోకి తీసుకున్నారు.