వేములవాడలో గంజాయి గ్యాంగ్ ​అరెస్ట్​

వేములవాడలో గంజాయి గ్యాంగ్ ​అరెస్ట్​

వేములవాడ, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురిని అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ తెలిపారు. ఆదివారం వేములవాడ టౌన్‌‌ పీఎస్‌‌లో వివరాలు వెల్లడించారు. యూపీకి చెందిన వికాస్, ఒడిశా నుంచి ఇద్దరు మైనర్ల ద్వారా 5 కేజీల గంజాయిని ఓ ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సు ద్వారా శనివారం కరీంనగర్‌‌‌‌ తెప్పించాడు. అక్కడి నుంచి వేములవాడకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి చింతలఠాణా సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. జిల్లాలో గంజాయి తరలింపు, విక్రయాలు చేపడితే పీడీ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఇన్‌‌చార్జి  డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.