కంది పంటలో గంజాయి సాగు.. ఆసిఫాబాద్ జిల్లాలో రైతుపై కేసు నమోదు

కంది పంటలో గంజాయి సాగు.. ఆసిఫాబాద్ జిల్లాలో రైతుపై కేసు నమోదు

తిర్యాణి, వెలుగు : కంది పంటలో గంజాయి సాగు చేసిన రైతుపై ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం కొద్దుగూడ పరిధి చెలిమెలకు చెందిన రైతు ఆత్రం పాపారావు తన కంది చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారం తెలియడంతో తిర్యాణి పోలీసులు శుక్రవారం వెళ్లి 10 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆత్రం పాపారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ శ్రీనివాస్,  ఏఈవో వినోద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.