గంజాయి సేవిస్తున్న ఏడుగురి అరెస్ట్..హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఘటన

గంజాయి సేవిస్తున్న ఏడుగురి అరెస్ట్..హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఘటన

ఎల్కతుర్తి (కమలాపూర్), వెలుగు: గంజాయి సేవిస్తున్న ఏడుగురిని హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ ఎస్సై దిలీప్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తుండగా శనిగరం శివారులోని  తాటి వనంలో ఏడుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మల్యాలకు చెందిన ఇల్లందుల అరవింద్, చిలువేరు చరణ్,  వంగపల్లికి చెందిన కోటపాక నితిన్ తో పాటు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై దిలీప్ తెలిపారు. ‌‌‌‌వీరి నుండి 33 గ్రాముల గాంజా, ఒక గ్లామర్ బైక్, 7 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నవీన్ వెల్లడించారు.