గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్... మంచిర్యాల పోలీసుల అదుపులో నిందితులు

గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్... మంచిర్యాల పోలీసుల అదుపులో నిందితులు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో గంజాయి అమ్ముతుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శశిధర్​ రెడ్డి, ఎస్సై రాజశేఖర్​ వివరాలు వెల్లడించారు. మందమర్రి టోల్​ ప్లాజా వద్ద ఉన్న రెస్ట్​ ఏరియాలో మంచిర్యాల తిలక్​నగర్​కు చెందిన షేక్​ అజీజ్, వనం సాయికృష్ణ, ఆసిఫాబాద్​జిల్లా ఈస్​గాంకు చెందిన తరుణ్​సర్కార్ గంజాయి పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. 

తరుణ్ ​సర్కార్ ఒడిశా నుంచి గంజాయిని మంచిర్యాలకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. గంజాయికి అలవాటుపడ్డ అజీజ్, సాయికృష్ణ అమ్మకానికి సహకరిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.15వేల విలువైన 750 గ్రాముల గంజాయి, ఓ ఆటో, మూడు మొబైల్స్​స్వాధీనం చేసుకు న్నారు. తరుణ్, అజీజ్​పై ఇప్పటికే గంజాయి కేసులున్నాయన్నారు.----