ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు.. మాజీ మంత్రి అరెస్ట్..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు.. మాజీ మంత్రి అరెస్ట్..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు‌  అరెస్ట్ అయ్యారు. గంటా శ్రీనివాసరావుతో పాటు  ఆయన  కొడుకును  కూడా పోలీసులు అరెస్ట్  చేశారు.  ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో గంటా శ్రీనివాసరావును, ఆయన కొడుకును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు మానవ వనరుల శాఖ  మంత్రిగా పనిచేశారు.   

తనను అరెస్ట్ చేయడంపై  గంటా శ్రీనివాసరావు స్పందించారు. అమరావతి భూముల కేసులో తన పేరు చేర్చారని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా.. ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు.