బాంబ్ ఉందంటూ పుకార్లు..3 గంటలు నిలిచిన రైలు

బాంబ్ ఉందంటూ పుకార్లు..3 గంటలు నిలిచిన రైలు

బాంబు బెదిరింపుతో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న గరీబ్ రథ్ రైలును రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అధికారులు నిలిపివేశారు. సోమవారం అర్థరాత్రి దాటాక రైలులో బాంబు ఉందని కొందరు వ్యక్తులు పుకార్లు వ్యాప్తి చేశారు. దీంతో వెంటనే రైల్వే అధికారులు రైలులు ధోల్ పూర్ స్టేసన్ లో ఆపేశారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రైల్వే స్టేషన్ కు చేరుకుని సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు బయటపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బాంబ్ ఉందంటూ పుకార్లు వ్యాప్తి చేసిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రైల్లో బాంబ్ ఉందంటూ పుకార్లు రావడంతో  హజ్రత్ నిజాముద్దీన్ - నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12612) రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ స్టేషన్‌లో మూడు గంటలపాటు నిలిచిపోయింది. 'రైల్ మదద్' పోర్టల్ ద్వారా ఓ ప్రయాణికుడు బాంబు గురించి తెలియజేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్  తనిఖీలు చేయగా..బూటకపు కాల్ అని తేల్చారు.