ఆయిల్ ఇండియాకు జాక్పాట్.. అండమాన్‌‌‌‌‌‌‌‌లో సహజ వాయువు నిల్వల గుర్తింపు

ఆయిల్ ఇండియాకు జాక్పాట్.. అండమాన్‌‌‌‌‌‌‌‌లో  సహజ వాయువు నిల్వల గుర్తింపు

న్యూఢిల్లీ: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్​) అండమాన్ దీవుల తీరంలో సహజ వాయువు నిల్వలను కనుగొన్నట్లు ప్రకటించింది. వీటి  పరిమాణం ఎంత అనేదానిపై కంపెనీ ఇంకా అంచనాకు రాలేదు. ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద కంపెనీ గెలుచుకున్న ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ అండమాన్ బ్లాక్ లో డ్రిల్ చేసిన రెండో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోరేటరీ బావిలో సహజ వాయువును గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమికస్థాయి పరీక్షలు సహజ వాయువు ఉనికిని నిర్ధారించాయని పేర్కొంది. 

వాయువు  ఆవిర్భవాన్ని (జెనిసిస్​) అర్థం చేసుకోవడానికి మరిన్ని స్టడీలు జరుగుతున్నాయి. చమురు అవసరాల కోసం భారతదేశం 88 శాతం దిగుమతులపై, గ్యాస్ అవసరాల కోసం 50 శాతం విదేశాలపై ఆధారపడుతోంది. ఆయిల్ ఇండియాతోపాటు ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ) అండమాన్ సముద్రంలో హైడ్రోకార్బన్ నిల్వల కోసం వెతుకున్నాయి.