ODI World Cup 2023: శత్రువులు కూడా పొగడాల్సిందే: కోహ్లీపై గంభీర్ ప్రశంసలు

ODI World Cup 2023: శత్రువులు కూడా పొగడాల్సిందే: కోహ్లీపై గంభీర్ ప్రశంసలు

విరాట్ కోహ్లీ..ఈ స్టార్ ఆటగాడికి భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అరుదులో అరుదుగా విరాట్ మీద విమర్శలు గుప్పించేవారు కూడా ఉంటారు. వారిలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ముందువరుసలో ఉంటాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే మైదానంలో చాలా సార్లు తమ దూకుడుతూ ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు. అప్పటినుంచి గంభీర్ ఏదో ఒకరకంగా కోహ్లీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. 

ఇదిలా ఉండగా.. తాజాగా కోహ్లీ తన ఇన్నింగ్స్ తో గంభీర్ ని సైతం ఇంప్రెస్ అయ్యేలా చేసాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ ఛేజింగ్ లో చెలరేగిపోతున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక నిన్న న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ కు ఫిదా అయిన గంభీర్.. ప్రశంసలు కురిపించాడు.

Also Read :- చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల

కోహ్లీ ఆల్ టైం గ్రేట్ ఫినిషర్ అని, కోహ్లీ కంటే గొప్పగా ఎవరూ ఇన్నింగ్స్ ను ఫినిష్ చేయలేరని చెప్పుకొచ్చాడు. ఫినిషర్ అంటే చివర్లో వచ్చేవాడు కాదని.. కోహ్లీలా చివరి వరకు క్రీజ్ లో ఉండాలని కోహ్లీని ఆకాశానికి ఎత్తేసాడు. ఛేజ్ మాస్టర్ అనే ట్యాగ్ కి మరోసారి కోహ్లీ న్యాయం చేసాడని తెలిపాడు. మొత్తానికి కోహ్లీ తన గ్రేట్ ఇన్నింగ్స్ తో గంభీర్ ను కూడా మెప్పించడం విశేషం.