టాలెంట్ ఉన్నా.. సెలక్ట్ చేయడం లేదు:గంభీర్

టాలెంట్ ఉన్నా.. సెలక్ట్ చేయడం లేదు:గంభీర్

బీసీసీఐ సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. టాలెంట్ ఉన్నా పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవడం లేదని విమర్శించాడు. కోచ్ అంటే ప్రాక్టీస్లోత్రోడౌన్స్ వేయడం, మ్యాచ్కు ఆటగాళ్లను సిద్ధం చేయడమే కాదన్నాడు. అండర్ 19 టీమ్కు ద్రవిడ్ కోచ్గా ఉన్నప్పుడు పృథ్వీ షా రాణించాడని గుర్తు చేశాడు. షా, ద్రవిడ్ మధ్య సంబంధాలు ఉన్నాయన్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ..వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్ మెంట్కు ఉంటుందని గంభీర్ తెలిపాడు. 

మొండి చేయి..

2019లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన  పృథ్వీ షా..మొదట్లో మెరుగ్గానే రాణించాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, డోపింగ్ టెస్టులో విఫలమవడంతో పృథ్వీ షా జట్టుకు దూరమయ్యాడు. వీటన్నింటి నుంచి తేరుకుని దేశవాళీ టోర్నీల్లో  పృథ్వీ షా మెరుగ్గానే రాణిస్తున్నాడు. దీంతో అతను  టీమిండియాకు ఎంపికవుతాడని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతనికి మొండి చెయ్యి చూపుతూ వస్తున్నారు.