
పెద్దపెద్ద బాంబుల మోతతో మరోసారి గాజా దద్ధరిల్లుతోంది. పాలస్తీనా ప్రత్యేక దేశ ఏర్పాటుకు ఐక్యరాజ్య సమితి (UNO) తీర్మానంపై ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆయుధాలకు పనిచెప్పింది. గాజాపై పెద్ద పెద్ద బాంబులతో దాడులకు దిగింది. దీంతో సోమవారం (సెప్టెంబర్ 15) నుంచి గాజా బాంబుల మోతతో మార్మోగిపోతోంది.
ఇజ్రాయెల్ బాంబుల దాడికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడలో కుప్పకూలి పోయాయి. గాజా మండిపోతోంది.. గాజాను బ్లాస్ట్ చేస్తున్నాం.. ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది.
మిషన్ కంప్లీట్ అయ్యే వరకు వెనక్కు తగ్గం. హమాస్ లొంగి పోవాల్సిందే. గాజాను ఖాళీ చేసి వెళ్లాలి. వాళ్ల దగ్గర ఉన్న బంధీలను విడుదల చేయాలి. లేదంటే మరింత ఉధృతంగా దాడులు నిర్వహిస్తాం. గాజాను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్జ్ మంగళవారం (సెప్టెంబర్ 16) ప్రకటించారు. సామాన్య ప్రజలు గాజాను వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
►ALSO READ | భారత్ మా మక్కలు కొనాలి..లేకపోతే అమెరికన్ మార్కెట్లోకి రాకుండా చేస్తం
ఇప్పటికే గాజా దాదాపు ధ్వంసం అయ్యింది. అయితే చాలా వరకు సామాన్యులు ఖాళీ చేసి పొట్ట చేతపట్టుకుని వెళ్లిపోయారు. యుద్ధం ముగుస్తుందేమోననే ఆశతో ఇంకా కొందరు అక్కడే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం దాడులు ముమ్మరం కావడంతో కొందరు రాత్రికి రాత్రే కట్టుబట్టలతో వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు కూడా వెళ్లిపోవాలని.. గాజాను పూర్తిగా తగలబెట్టేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడం యుద్ధ తీవ్రతను పెంచింది.
Israel’s double airstrike sent a multi-story building in Gaza crumbling to the ground pic.twitter.com/WoFG3V3CX4
— RT (@RT_com) September 15, 2025