పదేళ్ల క్రితం ఇదే కాలేజ్‌లో షూటింగ్ చేశాను

పదేళ్ల క్రితం ఇదే కాలేజ్‌లో షూటింగ్ చేశాను
  •  కాలేజ్ లైఫ్ మనకు ఎంతో నేర్పిస్తుంది
  • పదేళ్ల క్రితం ఇదే కాలేజ్‌లో షూటింగ్ చేశాను
  • థాంక్యూ చూసినప్పుడు గీతాంజలి సినిమా ఫీలింగ్

హీరో నాగ చైత‌న్య, రాశీఖన్నా  జంటగా నటించిన థాంక్యూ సినిమా జూలై 22న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.  శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్పెంచిన యూనిట్.. గురువారం విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహించారు. 

ఈవెంట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘పదేళ్ల క్రితం మీ కాలేజ్‌కు వచ్చి షూటింగ్ చేశాను. ఇక్కడకు మళ్లీ రావడం ఆనందంగా ఉంది. కాలేజ్ ఈవెంట్స్‌కు వచ్చినప్పుడు నేను ఎక్కువ జెలసీగా ఫీలవుతుంటాను. ఎందుకంటే ఈ కాలేజ్ లైఫే అసలు లైఫ్. స్కూల్, కాలేజ్ లైఫ్ మనకు ఎంతో నేర్పిస్తుంది. కానీ మనం దాన్ని అప్పుడు రియలైజ్ అవ్వం. కానీ ఓ పదేళ్ల తర్వాత అర్థమవుతుంది. ఈ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి. ఓ సినిమా హిట్ అయితే.. విజయవాడ నుంచే ఆ సౌండ్ హైద్రాబాద్ వరకు వస్తుంది. మీరిచ్చే ఎనర్జీ, సపోర్ట్‌తో మేం ఏదైనా చేయగలం. పీసీ శ్రీరామ్ తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కలిసి పని చేశాను. రాశీ ఖన్నాతో పని చేయడం ఆనందంగా ఉంది. థాంక్యూ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి’ అని అన్నారు.

తమన్ మాట్లాడుతూ.. ‘నాగ చైతన్య జోష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. మేం ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ ఆయన కెరీర్‌లో చేసిన సినిమాలన్నింటిలో మజిలీ నాకు చాలా ఇష్టం. మజిలీ తర్వాత.. థాంక్యూనే ఫేవరేట్ సినిమా. ఇదంతా గ్రాటిట్యూడ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా గురువు మణిశర్మ బర్త్ డే వచ్చింది. ఆ పార్టీకి వెళ్లి మణిని హగ్ చేసుకున్నాను. నా కంట్లోంచి నీళ్లు తిరిగాయి. మణి కోసం అక్కడే డ్రమ్స్ వాయించాను. అదంతా  నా గ్రాటిట్యూడ్. ఈ సినిమాలోనూ అదే ఉండబోతోంది. మన వాళ్ళ కోసం థాంక్యూ చెప్పడం. ఈ సినిమా కోసం పని చేయడం ఆనందంగా ఉంది. థాంక్యూ లాంటి సినిమాలు ఓ రకమైన సంతోషాన్నిస్తాయి.  దిల్ రాజుకి ఒళ్లంతా దిల్లే. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. రీ రికార్డింగ్ చేయకుండానే ఈ చిత్రం చూసినప్పుడు నా కంట్లో నీళ్లు వచ్చాయి. ఈ చిత్రంలోనే ఓ లైఫ్ ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు థాంక్యూ. విక్రమ్ కె కుమార్ చుట్టూ ఎప్పుడూ ప్రేమ తిరుగుతూనే ఉంటుంది’ అన్నారు.

విక్రమ్ కే కుమార్ మాట్లాడుతూ.. ‘మేం ఈ సినిమాను ఎంతో ప్రేమతో తెరకెక్కించాం. మీరు ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ..‘నాగార్జున, నాగ చైతన్యకి నేను అభిమానిని. ఈ సినిమా అనేది వారికి గ్రాటిట్యూడ్‌‌లాంటిది. విక్రమ్ కుమార్ సినిమాలు అన్నీ చూసి ఉంటారు.. కానీ అందులోంచి థాంక్యూ అనేది ది బెస్ట్ అవుతుంది. తమన్ సౌండింగ్, పీసీ శ్రీరామ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గీతాంజలి సినిమాను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఈ సినిమాను చూసినప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఓ పండుగలా అనిపిస్తుంది’ అన్నారు.