హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జెన్‌కో హెచ్‌ఆర్ డైరెక్టర్ అశోక్ కుమార్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. విద్యుత్ సంస్థలోని ఉద్యోగ నియామకాల్లో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ కీలకం. అయితే అక్రమ నియామకాలపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాల మధ్య అశోక్‌కుమార్ రాజీనామా విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది.
