థర్మల్ ప్లాంట్ ​ఏర్పాటుకు డీపీఆర్​ సిద్ధం చేయండి

 థర్మల్ ప్లాంట్ ​ఏర్పాటుకు డీపీఆర్​ సిద్ధం చేయండి
  • వారంలోగా మార్గదర్శకాలు ఇవ్వండి
  • జెన్​కోకు ఇంధన శాఖ ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: రామగుండంలో చేపట్టే సూపర్​క్రిటికల్​థర్మల్ పవర్ ప్లాంట్​నిర్మాణానికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు, డీపీఆర్​సిద్ధం చేయాలని జెన్​కోకు ఇంధనశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా మార్గదర్శకాలు ఇచ్చి, నెల రోజుల్లో  డీపీఆర్​ సబ్​మిట్​ చేయాలని పేర్కొన్నది. సింగరేణి తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని జెన్​కో ప్రాజెక్ట్​ డైరెక్టర్​కు సూచించింది.

గత ఆగస్టు 14న ప్రజాభవన్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్​సంస్థలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో,  రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​రాజ్​ఠాకూర్​​రాసిన లెటర్ కు సీఎంవో నుంచి వచ్చిన ప్రతిపాదనల నేపథ్యంలో రామగుండం థర్మల్​ప్లాంట్​ విషయం చర్చకు వచ్చింది.

 దీంతో రామగుండంలో గతంలో ఉన్న  62.5 మెగావాట్ల జెన్​కో ప్లాంట్​ స్థానంలో  800 మెగావాట్ల సూపర్​క్రిటికల్​థర్మల్​పవర్​ ప్లాంట్ ను​ ను జెన్​కో, సింగరేణి జాయింట్​ వెంచర్​గా ఏర్పాటు చేయాలని  నిర్ణయంతీసుకున్నాయి.