ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి : జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్

ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి : జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్

శివ్వంపేట, వెలుగు : ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్​  సూచించారు. శుక్రవారం శివ్వంపేట ఎంపీడీవో ఆఫీస్ లో నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా లక్పతినాయక్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు.

 ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. గడువు లోపల నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ ద్వా రానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. 

నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..

నారాయణ్ ఖేడ్ వెలుగు : నారాయణఖేడ్ డివిజన్​లో వెంకటాపూర్ క్లస్టర్ ను సంగారెడ్డి జిల్లా జనరల్ అబ్జర్వర్ కార్తీక్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని, సాయంత్రం 5 గంటల వరకు వచ్చినవారికి టోకెన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. 

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్.. 

న్యాల్కల్, వెలుగు : మండల కేంద్రంతోపాటు పలుచోట్ల నామినేషన్ కేంద్రాలను ట్రైనీ కలెక్టర్ ప్రతిభాశేఖర్ పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని ఆమె సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు.