భారత్ జోడో యాత్రపై ఏఐసీసీ సమావేశం

 భారత్ జోడో యాత్రపై ఏఐసీసీ సమావేశం

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇంఛార్జ్ లు సమావేశం అయ్యారు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాహుల్ ర్యాలీపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ ఘఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. సెప్టెంబర్ 4న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ద్రవ్యోల్బణంపై ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

3500 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభం అవుతుందని జైరామ్ రమేశ్ తెలిపారు. ఆగస్టు 22న అన్ని రాష్ట్రాలల్లో హల్లా బోల్- ఛలో ఢిల్లీ పేరుతో ర్యాలీలు నిర్వహించాలని పీసీసీలను ఆదేశించింది. ఆగస్టు 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని జైరామ్ రమేశ్ సూచించారు.