కోల్‌బెల్ట్, వెలుగు: యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు తెలంగాణ ఓవర్సీస్మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్), ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జర్మనీ భాషా శిక్షణ క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్అధికారి రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
