
బయట తిరిగితే కరోనా సోకుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. కానీ కొంతమంది వ్యాపారులు అదే కరోనా పేరు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు.
కేరళకు చెందిన ఓ ఎలక్ట్రానిక్ షాపు యజమాని కరోనాతో సొమ్ము చేసుకునేందుకు ఓ అడ్వటైజ్ మెంట్ ఇచ్చాడు. అదేంటంటే..!మా ఎలక్ట్రానిక్ షాపులో ఆగస్ట్ 15 నుంచి 30 వరకు ఎవరైతే వాళ్లకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేసి 24గంటల్లోపు కరోనా సోకినట్లు తేలితే వాళ్లకి జీఎస్టీ లేకుండా రూ.50 వేల క్యాష్‌ప్రైజ్ ఇస్తామని సదరు యజమాని ప్రకటించాడు. అంతే ఈ ఆఫర్ వైరల్ అవ్వడంతో కొట్టాయంలోని పాల మున్సిపాలిటీ కౌన్సిలర్, న్యాయవాది పులిక్కక్కందం ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లిస్టపరిస్థితుల్లో కరోనా పేరు చెప్పి ప్రజల్ని ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఇలా చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేయడం శిక్షార్హమని పేర్కొంటూ రాష్ట్ర సీఎం విజయన్ కు ఆయన లేఖ రాశారు. కరోనా వైరస్ బారినపడ్డ వ్యక్తిని అది దాచిపెట్టి దుకాణానికి రమ్మన్నట్టుగా ఈ ఆఫర్ ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయమై సీఎం పినరయి విజయన్ స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు రిటైల్ దుకాణాన్ని మూసివేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నారు.