బాలీవుడ్ డైరక్టర్ కరణ్ జోహార్ పై షిరోమణి అకాలిదళ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సెటైర్లు వేశారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కరణ్ జోహార్ తనపై వస్తున్న
వార్తలను ఖండిస్తూ ఓ లేఖ విడుదల చేశారు.
అనుభవ్ చోప్రా – క్షితిజ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితాలతో నాకు ధర్మ ప్రొడక్షన్స్ కు ఎలాంటి సంబంధమూ లేదు. ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపలు జరపలేదు అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.
అయితే ఆ లేఖపై మంజిందర్ సింగ్ సిర్సా కరణ్ జోహార్‌ను బాలీవుడ్ డ్రగ్ కార్టెల్స్ కింగ్‌పిన్ తో పోల్చారు. అంతేకాదు కరణ్ త్వరలో 2019 లో జరిగిన డ్రగ్ పార్టీ వీడియో గురించి కరణ్ “ఎన్‌సిబితో కాఫీ” కోసం సిద్ధంగా ఉండాలని అకాలిదళ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సెటైర్లు వేశారు.
