
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటించిన ఘాటి రేపు శుక్రవారం (సెప్టెంబర్ 5న) రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఘాటి రిలీజ్ గ్లింప్స్ విడుదల చేశారు.
1 నిమిషం 21 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ ఓ రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంటెన్స్గా సాగింది. శీలావతి క్యారెక్టర్‌లో అనుష్క శత్రువులను ఉచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించింది. అనుష్క కనపడిన ప్రతి షాట్ సినిమా కోణాన్ని, తనలో ఉక్రోషాన్ని చూపిస్తుంది. ప్రధానంగా అనుష్క-విక్రమ్ ప్రభులు తమ ప్రత్యర్థులతో చేసే పోరాట సీన్స్తో ఈ గ్లింప్స్ కట్ చేశారు మేకర్స్.
ఇక గ్లింప్స్ చివర్లో.. ‘వాళ్లు ఊరుకోరు.. వీళ్ళు ఊరుకోరు.. అంటే, నేను ఊరుకోను’ అని చెప్పే అనుష్క డైలాగ్ ఉత్కంఠ పెంచేలా ఉంది. అనుష్క ఘాటి సినిమాతోప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఈ గ్లింప్స్ మరింత పెంచింది.
అయితే, అనుష్క కోసం ప్రభాస్ వచ్చి గ్లింప్స్ రిలీజ్ చేయడంతో ఇరువురు ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలో ఇంకోక్కసారి..మీరిద్దరూ జోడీగా (ప్రభాస్, అనుష్క) కనిపిస్తే చూడాలని ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో వీరి కాంబోలో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో ఘాటి మూవీ రిలీజ్ కు ముందు రోజే ప్రభాస్ రావడంతో, బుకింగ్స్ లో వేగం మరింత పెరిగే ఛాన్స్ ఉందని మేకర్స్ భావించారు.
ఇదిలా ఉంటే.. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో ‘ఘాటి’ రెండో సినిమా కావడం విశేషం. దానికితోడు క్రిష్ చాన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేయడం అంచనాలు పెరగడానికి మరో కారణమైంది. అలాగే యూవీ క్రియేషన్స్‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా అవడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాసరావు కథను అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.