ఘంటసాల రెండో కుమారుడు కన్నుమూత

V6 Velugu Posted on Jun 10, 2021

ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇవాళ ఉదయం గుండెపోటురావడంతో తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రత్నకుమార్ తెలుగు,తమిళ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు.

Tagged passed away, Ghantasala, second son Ghantasala Ratna Kumar

Latest Videos

Subscribe Now

More News