
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు GHMC జరిమానా విధించింది. వర్మ ఇటీవలే పవర్ స్టార్ అనే సినిమాను రూపొందించి ఆన్ లైన్ లో విడుదల చేశాడు. అయితే ఈ సినిమా కోసం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో పోస్లర్లు వేయించినట్టు ఫిర్యాదు రావడంతో… జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెట్ ఆర్జీవీకి రూ.4వేల జరిమానా వేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి GHMC కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు… వర్మ నిబంధనలు అతిక్రమించాడని గుర్తించి నాలుగు వేల రూపాయలు జరిమానాగా విధించారు. దానికి సంబంధించిన చలానాను జూబ్లీహిల్స్, గాయత్రిహిల్స్‌లోని ఆర్జీవీ అడ్రస్‌కు పంపనున్నట్టు తెలిపారు.