జానంపేట సబ్ స్టేషన్ లో ట్రాన్స్​ఫార్మర్ల పంపిణీ

 జానంపేట సబ్ స్టేషన్ లో ట్రాన్స్​ఫార్మర్ల పంపిణీ

అడ్డాకుల, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ట్రాన్స్​ఫార్మర్లను రైతులు వినియోగించుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట సబ్ స్టేషన్ లో మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు అగ్రికల్చర్ వినియోగదారుల ట్రాన్స్​ఫార్మర్స్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకే ట్రాన్స్​ఫార్మర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. అడ్డాకులకు 12, భూత్పూర్ కు 31, మూసాపేటకు 14 మొత్తం 57 ట్రాన్స్​ఫార్మర్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఈలు అరుణ్ కుమార్, కిరణ్ కుమార్, మెట్ శాల, రైతులు, నాయకులు పాల్గొన్నారు.