ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం

ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం
  • వాటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ అమలు 
  • డివిజన్ల వారీగా రిపోర్ట్​ల కోసం సర్వ
  • వివరాల సేకరణలో సిబ్బందికి కన్​ఫ్యూజన్​

హైదరాబాద్, వెలుగు: బల్దియా పరిధిలో ఫ్రీ వాటర్ స్కీం అమలుకు వాటర్ బోర్డు స్పెషల్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. సిటీలో డివిజన్ల వారీగా నల్లా కనెక్షన్లు, బస్తీల సంఖ్య, లబ్ధిదారుల లెక్కలు పక్కాగా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.  ప్రధానంగా కనెక్షన్లకు మీటర్లు, కస్టమర్​ ఆధార్ సీడింగ్ కు ప్రయార్టీ ఇస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుండగా, ఫీల్డ్​లెవల్​లో పక్కాగా స్ట్రీమ్ లైన్ చేసేందుకు నిర్ణయించింది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. వాటర్ బోర్డు యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి డివిజన్ లో మీటర్లు లేని నల్లా కనెక్షన్లను పక్కాగా లెక్కించేందుకు సిద్ధమైంది. దీంతోపాటు కనెక్షన్లు తీసుకోని నల్లాలను కూడా గుర్తించే పనిలో పడింది. మీటర్ రీడర్లను రంగంలోకి దింపగా, వీరంతా ఇంటింటి సర్వే, ఆధార్ సీడింగ్, నల్లా కనెక్షన్లకు మీటర్ వంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు వాటర్ బోర్డు లెక్కల ప్రకారం 7 లక్షల నల్లాలకు మీటర్లు లేవని చెబుతున్నా, ఈ సంఖ్య మరింత పెరగనుంది.  ఇక బస్తీల్లోనూ ప్రతి నల్లా కనెక్షన్​ ఓనర్​ఆధార్ వివరాలను ఎన్ రోల్ అయ్యేలా చూస్తున్నారు.

డివిజన్ల వారీగా రిపోర్ట్​లు

వాటర్ బోర్డు పరిధిలో మొత్తం 19 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలో 50 వేల నుంచి లక్ష వరకు నల్లా కనెక్షన్లు ఉంటాయి. ప్రతి డివిజన్ లో కనీసం 10 వేల నుంచి 18 వేల దాకా బస్తీ కనెక్షన్లు ఉండొచ్చు. వీటికి త్వరలోనే ఆధార్ సీడింగ్ చేయనుంది. డివిజన్ పరిధిలోని వివరాలను బట్టి భవిష్యత్​లో వాటర్ డిమాండ్, ఇంకా సరఫరా చేయాల్సిన నీళ్లు, వృథా నీటి పరిమాణం కచ్చితంగా లెక్కించేలా ప్లాన్​ చేసుకుంది. త్వరలోనే డివిజన్ల వారీ వివరాల రిపోర్ట్​లను  సిద్ధం చేయనుంది. అయితే వాటర్ బోర్డు భవిష్యత్​కార్యాచరణపై కిందిస్థాయి సిబ్బందికి స్పష్టత లేకపోవడంతో సీడింగ్, మీటర్ల లెక్కల్లో ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సిబ్బంది అరకొర సమాచారమే సేకరిస్తుండగా, కొన్నిచోట్ల ఆధార్ లోని తప్పులు లింకేజీలో సమస్యలకు కారణమైతుందని తెలుస్తోంది.

ట్రయల్ కన్ ఫ్యూజన్

స్కీం అమలు చేస్తున్నట్లుగా ఆదేశాలిచ్చినా… క్షేత్రస్థాయిలో ఇంకా గందరగోళం పోలేదు.  ఆధార్ సీడింగ్, నల్లా మీటర్లకు సంబంధించిన అంశాలపై అధికారులకు క్లారిటీ లేకనే స్కీం అమలులో ప్రాబ్లమ్స్​ వస్తున్నాయి.  ఉదాహరణకు ఆధార్ సీడింగ్ చేసే క్రమంలో అపార్టుమెంట్ కమిటీ వివరాలను ఎలా నమోదు చేయాలి, ఎవరి పేరును ప్రామాణికంగా తీసుకోవాలనే అంశం సిబ్బందికి కన్​ఫ్యూజన్​గా ఉంది.  దీంతోపాటు కొన్ని చోట్ల బిల్డర్ పేరిట ఉన్న  కనెక్షన్ వివరాలను ప్రస్తుతం ఉన్న ఓనర్ల ఆధార్ తో  లింక్ కావడం లేదు. అయితే కనెక్షన్ వివరాలు మార్చుకునేందుకు వాటర్ బోర్డు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం గందరగోళంలో పడేస్తోంది. దీంతో ఆధార్​ సీడింగ్ అయ్యేంత వరకు ఫ్రీ వాటర్ స్కీం వర్తించదని, అప్పటివరకు బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు  చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

సీల్డ్ కవర్​లో మేయర్ పేరు.. ఆశావహుల్లో టెన్షన్

పీపీపీ మోడ్​లో మూసీ నది బ్యూటిఫికేషన్​

నయిమ్ ప్రధాన అనుచరుడు ఎండి నాసర్ మృతి