
ధరణి వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియలో అలసత్వం వహించిన జీహెచ్ఎంసీ అధికారిణి పై వేటు పడింది. చార్మినార్ జోన్ పరిధిలో పనిచేసే ఒక డిప్యూటీ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని సి.ఎస్. ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ మంగతాయారుతో పాటు ఒక ఎన్యుమరేటర్ ను సస్పెండ్ చేశారు జిహెచ్ఎంసి అధికారులు. ఇప్పటికే చార్మినార్ జోన్ లో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను జోనల్ కమిషనర్ సస్పెండ్ చేశారు.