
- గేటెడ్ కమ్యూనిటీల్లోకి వారిని అనుమతించాలి
- లిఫ్ట్‌లు, పార్కింగ్ సౌకర్యం కల్పించాలి
- బల్దియా సర్క్యులర్ జారీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్లలోకి పోస్ట్మెన్లను తప్పనిసరిగా అనుమతించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మూడు రోజుల కింద సర్క్యులర్ జారీ చేశారు. పోస్ట్మెన్లకు లిఫ్ట్‌లు, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈ సర్క్యులర్‌ను అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు పంపించారు. పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్ల డెలివరీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని జీహెచ్ఎంసీ దృష్టికి ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ శరత్ కుమార్ తీసుకెళ్లారు. దీంతో కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.