అందరికి చెబుతాం.. మేం పాటించం .. జీహెచ్ఎంసీ ఆఫీసుల్లోకి చేరిన వర్షపు నీరు

అందరికి చెబుతాం.. మేం పాటించం .. జీహెచ్ఎంసీ ఆఫీసుల్లోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సున్ లోపు నిర్మాణంలో ఉన్న పనులు పూర్తి చేయాలని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు తమ సొంత ఆఫీస్​కు సంబంధించిన పనులు మాత్రం సరిగ్గా వర్షాల టైంలోనే మొదలు పెట్టారు. హెడ్ఢాఫీస్​లోని ఫస్ట్ ఫ్లోర్ లో కమిషనర్ చాంబర్​కు ముందు భాగంలో గార్డెనింగ్ కోసం రూఫ్ పై పనులు చేయిస్తున్నారు. 

 ఈ క్రమంలో స్లాబ్​పై డ్రిల్లిండ్ వేస్తుండగా,  స్లాబుకు డ్యామేజ్ అయింది. దీంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రౌండ్ ఫ్లోర్​లోని కస్టమర్ సర్వీస్ సెంటర్, ఇన్ వార్డు సెంటర్ తో పాటు విజిలెన్స్ ఆఫీస్ లోకి వర్షపునీరు చేరింది. అధికారుల క్యాబిన్ లో పెచ్చులు ఊడి పడ్డాయి.