
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. బుధవారం శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘బిగ్ డాడీ’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఓ పాడుబడ్ద బిల్డింగ్‌లో కూర్చుకుని మందు కొడుతున్న శివరాజ్ కుమార్‌ను విలన్స్ గ్యాంగ్ ఆయుధాలతో చుట్టుముట్టారు. చేతిలోని మందు గ్లాసు, సిగరేట్‌తో తన వెనకున్న కవర్‌ను ఆయన కాల్చడంతో ‘బిగ్ డాడీ’ అని పిలుచుకునే భారీ యుద్ధ టాంకర్ రివీల్ అయింది.
‘మీరు గన్ను తో భయపెట్టిన వారికంటే ఎక్కువమందిని నేను నా కళ్ళతో భయపెట్టాను. దే కాల్ మీ ఓ జీ... ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అని శివన్న చెప్పే డైలాగ్‌తో పాటు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. మరోవైపు శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కార్తీక్ అద్వైత్ దర్శకుడు. సుధీర్ చంద్ర పదిరి దీనికి నిర్మాత. ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శివన్న టెర్రిఫిక్ లుక్‌లో కనిపించారు.