రాహుల్ వల్లే పార్టీ నాశనం, ఆయనవి పిల్లచేష్టలు

రాహుల్ వల్లే పార్టీ నాశనం, ఆయనవి పిల్లచేష్టలు
  • కాంగ్రెస్​కు ఆజాద్ గుడ్ బై
  • సోనియాకు రాజీనామా లేఖ.. 
  • 50 ఏండ్ల ప్రస్థానానికి సెలవు 
  • రాహుల్ వల్లే పార్టీ నాశనం, ఆయనవి పిల్లచేష్టలు  
  • సోనియా పాత్ర నామమాత్రమే 
  • సీనియర్లకు విలువ లేదు: గులాం నబీ ఆజాద్
  • త్వరలో కొత్త పార్టీ పెట్టే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లెటర్ పంపించారు. అందులో పార్టీ విధానాలు, హైకమాండ్, రాహుల్ గాంధీ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీ పరిస్థితి, తన రాజీనామాకు గల కారణాలపై నాలుగు పేజీల లేఖలో వివరించారు. ‘‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదు. ఇప్పటికీ రిమోట్ కంట్రోల్ విధానంలోనే పని చేస్తోంది. చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదు. పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఇక మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది” అని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు. అందుకే పార్టీతో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆజాద్ కు మద్దతుగా జమ్మూకాశ్మీర్ లో ఐదుగురు నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మరోవైపు ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. 1970లో కాంగ్రెస్ లో చేరిన ఆజాద్.. 50 ఏండ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీ లీడర్ షిప్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2020లో సోనియాకు లేఖ రాసిన జీ23 గ్రూపు నేతల్లో ఆజాద్ ఒకరు. 

రాహుల్ తోనే పతనం ప్రారంభం.. 

రాహుల్ గాంధీ తీరుపై ఆజాద్ తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీలో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని చెప్పారు. అన్ని కీలక నిర్ణయాలను రాహుల్, ఆయన పీఏలు, సెక్యూరిటీ గార్డులే తీసుకుంటారని విమర్శించారు. రాహుల్ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని.. వాళ్ల సలహాలు, సూచనలతోనే పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ నేతృత్వంలో రెండు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, మరో రెండు రాష్ట్రాల్లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. ‘‘రాహుల్ రాజకీయాల్లోకి వచ్చినంకనే కాంగ్రెస్ పతనం మొదలైంది.2013లో రాహుల్ ను ఉపాధ్యక్షుడిగా చేసిన తర్వాత పార్టీని సర్వనాశనం చేశారు. ఆయనకు రాజకీయాలపై అవగాహన లేదు. పిల్ల చేష్టలు. ప్రభుత్వ ఆర్డినెన్స్ ను మీడియా ముఖంగానే చించేశారు. పార్టీ పలు రాష్ట్రాల్లో ఓడిపోవడానికి ఆయన అపరిపక్వతే కారణం” అని విమర్శించారు. 

పార్టీకి ద్రోహం చేశారు: కాంగ్రెస్ 

ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయన పార్టీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. ‘‘ఆజాద్ పదవీకాలం పూర్తయినప్పుడు పార్లమెంట్ లో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆజాద్ కు పద్మ విభూషణ్ వచ్చింది. ఇది యాధృచ్ఛికంగా జరగలేదు. పరస్పర సహకారంతోనే జరిగింది. ఆజాద్ డీఎన్ఏ మోడీ–ఫైడ్ అయింది” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు. ఆజాద్ పదవి లేకుండా ఒక్క సెకన్ కూడా ఉండలేరని, రాజ్యసభ టర్మ్ ముగిసిన వెంటనే రాజీనామా చేశారని పార్టీ నేత పవన్ ఖేరా విమర్శించారు.

దెబ్బ మీద దెబ్బ.. 

కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరుగురు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జీ 23 నేత కపిల్ సిబల్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, గుజరాత్ కు చెందిన హర్దీక్ పటేల్, కేంద్ర మాజీ మంత్రులు అశ్వనీ కుమార్, ఆర్పీఎన్ సింగ్ ఇప్పటికే పార్టీని వీడగా తాజాగా ఆజాద్ వెళ్లిపోయారు.

పార్టీ ఎన్నికలు.. పెద్ద మోసం 

పార్టీలో జరిగే సంస్థాగత ఎన్నికలు పెద్ద మోసమని ఆజాద్ ఆరోపించారు. దేశంలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు. ఏఐసీసీ కోటరీ ముందుగా తయారు చేసిన జాబితాపైనే బలవంతంగా సంతకాలు చేయిస్తారని ఆరోపించారు. కొత్తగా ఎన్నిక కాబోయే ప్రెసిడెంట్ కీలుబొమ్మ మాత్రమేనని విమర్శించారు. కాగా, భారత్ జోడో యాత్రకు బదులు కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని హైకమాండ్ కు సూచించారు. పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.