క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు

క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు

భూతల్లి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఎప్పుడు దుఃఖం పాలు చేయడమేనా అనుకున్నదేమో కానీ అల్లం రైతులకు ఈసారి కాసుల వర్షం కురిపించి అన్నదాతలను ఆశీర్వదించింది. ఏకంగా గతం కంటే అల్లం ధర ఎనిమిది రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఎనిమిది రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పాత అల్లం ధర హోల్​ సేల్​ మార్కెట్లలో క్వింటా 46 వేల రూపాయిలు మద్దతు ధర పలకడంతో అల్లం రైతులు కోటీశ్వరులు అయ్యారు. మహారాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు ప్రకారం.. మార్చి 28న పాత ( ఎండు)  అల్లం క్వింటాల్‌కు రూ.46 వేలకు  వరకు ఉంది.

 రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఎనిమిది రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది  రైతులు సంవత్సరం అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటా అల్లం ధర రూ.1500 నుంచి రూ. రెండు వేల వరకు మాత్రమే పలుకుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.40 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో  అల్లం పంటను సాగు చేసిన రైతులు ఆనందంగా ఉన్నారు. . కొన్నిసార్లు రైతులు ధర లేకపోవడంతో భూమిలోనే వదిలేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది.

గత ఐదేళ్లుగా అల్లం పంటకు నష్టాలు రావడంతో కొంతమంది రైతులు సాగు చేయడం మానేశారు. ఈ సంవత్సరం మంచి ధర రావడంతో రైతులు అల్లం వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎకరాకు సుమారుగా రూ. 1.20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ధర ఉంటేనే లాభ ఉంటుంది లేదంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్యునికి భారంగా అల్లం ధర అల్లం ధర పెరిగిందని రైతులు ఆనందంగా ఉన్న కొనుగోలుదారులకు కొంత నష్టం కలుగుతుంది. అల్లం.. పేదోడి నుంచి కోటిశ్వరుడి వరకు ప్రతిరోజు కూరల్లో వాడే సుగంధ ద్రవ్యం. అల్లం ధర పెరిగిందని రైతు ఆనందంగా ఉన్న సామాన్యుడికి కొంత భారంగా తయారయింది. రైతు నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ఒకటికి నాలుగు రేట్లు పెంచి అమ్మడంతో అల్లం రేట్లు పుండెక్కాయి.

సామాన్యులకు బిగ్ షాక్. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి, చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, తాజాగా అల్లం ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఏ కర్రీ వండుకున్నా అందులో అల్లం అనేది మస్ట్. ఇక స్పెషల్‌గా నాన్ వెజ్‌లో అల్లం లేకుంటే ఆ కర్రీ టెస్టే వేరే ఉంటుంది. కాగా, అలాంటి అల్లం ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. బహిరంగ మార్కెట్లలో కిలో రూ.500 నుంచి రూ.600ల ధర పలుకుతోంది.  10 రోజుల ముందు వరకు 100రూపాయలకు అటు ఇటుగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు.