భోజ్ పురి పాటకు మెట్రోలో డాన్స్లు.. వీడియో వైరల్

భోజ్ పురి పాటకు మెట్రోలో డాన్స్లు.. వీడియో వైరల్

మెట్రో స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇలాంటి చేష్టలు ఇటీవల ఢిల్లీ మెట్రోలో విపరీతంగా జరుగుతున్నాయి. బికినీ డ్రెస్సులు వేసుకోవడం, మెట్రో ప్రయాణిస్తున్నప్పుడే రీల్స్ చేయడం, ప్రయాణికులకు అడ్డుపడి సెల్ఫీలు దిగడం చస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి చీరకట్టుతో ఢిల్లీ మెట్రోలో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖేసరీ లాల్ యాదవ్, ప్రియాంక సింగ్‌ల ప్రసిద్ధ భోజ్‌పురి పాట ‘సాజ్ కే సావర్ కేకి’ డ్యాన్స్ చేసిన వీడియో అవని కరిష్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు స్పంధించిన నెటిజన్స్.. మెట్రో ప్రాంగణంలో ఎలాంటి ఫోటో లేదా వీడియోగ్రఫీని ఢిల్లీ మెట్రో సిబ్భంది నిషేధించినా ఇలాంటి చేష్టలు ఆగడం లేదు ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్లు చేస్తే.. మరికొందరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.