దారుణం: ఐదునెలల్లో బాలికపై రెండుసార్లు గ్యాంగ్‌రేప్

దారుణం: ఐదునెలల్లో బాలికపై రెండుసార్లు గ్యాంగ్‌రేప్

ఒకే బాలిక రెండుసార్లు అత్యాచారానికి గురైన ఘటన హర్యానాలో జరిగింది. 17 సంవత్సరాల బాలికను నలుగురు యువకులు ఎత్తుకెళ్లి రేప్ చేశారు. బాలిక డిసెంబర్ 4వ తేదీన రాత్రి ఇంటి ముందు తిరుగుతుండగా యువకులు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నిందితులంతా ఆమె ఊరికి చెందినవారే కావడం గమనార్హం. ఇక్కడ మరో దుర్మార్గమైన విషయం ఏంటంటే.. ఇదే బాలిక గత అయిదునెలల్లో రెండుసార్లు అత్యాచారానికి గురైంది. బాలికను అదే నిందితులు గత ఆగష్టు 13న కూడా అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె తల్లిదండ్రుల సహాయంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కానీ, గ్రామ పెద్దలు సర్దిచెప్పడంతో బాధితురాలు కేసును వాపస్ తీసుకుంది. ఇదే అదునుగా భావించిన నిందితులు సదరు బాధితురాలిని డిసెంబర్ 4న కూడా అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తిచేసినట్లు పాల్వాల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్ హీరా మణి తెలిపారు.