హైదరాబాద్, వెలుగు: సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో (సీహెచ్ఎఫ్ఎల్) 75.01 శాతం వాటాను వీవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి పొందుతున్న కుటుంబాలకు హోమ్ లోన్లు అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
పీపుల్ హోమ్ ఫైనాన్స్, సీహెచ్ఎఫ్ఎల్ కలయికతో సుమారు 140 శాఖలు ఏర్పడనున్నాయి. వీటి మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.రెండు వేల కోట్లు దాటింది. టెక్నాలజీ సాయంతో లోన్ల జారీని సులభతరం చేస్తామని, మొదటిసారి ఇల్లు కొనేవారికి ప్రాధాన్యం ఇస్తామని వీవర్ సర్వీసెస్ వెల్లడించింది.
