ఓటమిని ఒప్పందంగా చూపొద్దు.. ట్రంప్‎ను ఎద్దేవా చేసిన ఇరాన్

ఓటమిని ఒప్పందంగా చూపొద్దు.. ట్రంప్‎ను ఎద్దేవా చేసిన ఇరాన్

టెహ్రాన్: అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికపై ఇరాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫాఘరి ఎద్దేవా చేశారు. చర్చలపై ట్రంప్ చేస్తున్న వాదనలను బుధవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌‌‌‌లో ఆయన తోసిపుచ్చారు. అమెరికా తనలో తానే చర్చలు జరుపుకుంటోందని హేళన చేశారు.

 "మీ అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే.. మీకు మీరే చర్చలు జరుపుకునే స్థితికి వచ్చారా..? మా లాంటి వారు మీ లాంటి వారితో ఎప్పటికీ కలిసిపోలేరు. మాలో ఎవరూ మీతో ఒప్పందం చేసుకోరు. ఎప్పుడూ అది జరగదు" అని జోల్ఫాఘరి స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు మీరు గొప్పగా చెప్పుకునే వ్యూహాత్మక శక్తి ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారింది. మీ ఓటమిని ఒప్పందంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి’ అని ఆయన విమర్శించారు.