రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. ముస్తాబైన శిరసనగండ్ల ఆలయం 

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. ముస్తాబైన శిరసనగండ్ల ఆలయం 

వంగూరు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిరసనగండ్ల గుట్టపై సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్​ పర్సన్ రామశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం గుట్టపై ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకాలు, వేద పారాయణాలతో పాటు 27న సీతారాముల కల్యాణోత్సవం, 28న చిన్న రథం, 29న గరుడ సేవ, పెద్దతేరు, 30న గజసేవ, దోపోత్సవం, 30,న రాత్రికి పెద్ద రథం బ్రహ్మోత్సవాలు గజసేవ, దోపోత్సవం 31న పల్లకి సేవ, ఏప్రిల్​1న అభిషేకం, అర్చనలు,  2న చక్రతీర్థం ఏకాంత సేవ లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని, ప్రకృతి రమణీయతతో అలరారే ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.