తల్లిదండ్రులు తిట్టారని..జలపాతంలోకి దూకిన బాలిక

తల్లిదండ్రులు తిట్టారని..జలపాతంలోకి దూకిన బాలిక

మీ పిల్లలు తరచూ ఫోన్ చూస్తున్నారా..అలా చేస్తే వారిని మందలిస్తున్నారా..అయితే ఆగండి..ఫోన్ అస్తమానం చూస్తున్నారని తిట్టకండి..ఎందుకంటే..మనస్తాపంతో వారు ఏదైనా చేసుకునే అవకాశం ఉంది. అవును.. ఛత్తీస్ గడ్ లోని ఓ బాలిక అస్తమానం ఫోన్ చూస్తోంది..ఫోన్ వాడుతోందని ఆమె తల్లిదండ్రులు మందలించారు. అంతే ఆవేశంలో ఆ బాలిక జలపాతంలోకి దూకేసింది. 90 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకుతుండగా..ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అసలేమైంది..ఎవరా బాలిక..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం చిత్రకూట్ ప్రాంతానికి చెందిన సరస్వతి మౌర్య అనే బాలిక అస్తమానం సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపం చేసేది. దీంతో ఆమె తండ్రి శాంటో మౌర్య  మందలించాడు. సెల్ ఫోన్ తోనే గడుపుతున్నావ్..అంటూ తండ్రితో పాటు..తల్లి తిట్టింది. దీంతో మనస్తాపానికి గురైన సరస్వతి మౌర్య..ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో దగ్గర్లో ఉన్న చిత్రకోట్ జలపాతం వద్దకు చేరుకుంది. 90 అడుగుల ఎత్తు ఉన్న చిత్రకోట్ జలపాతం నుంచి నీటిలోకి దూకేసింది.

గమనించి..వీడియో తీసి...

Video: Scolded By Parents Over Mobile Phone Use, Girl Jumps Into Waterfall https://t.co/ynb0AGXO9x pic.twitter.com/utC1PUhY7j

— NDTV (@ndtv) July 19, 2023

 

చిత్రకోట్ జలపాతం దగ్గరకు సరస్వతి మౌర్య రావడాన్ని కొందరు స్థానికులు గమనించారు. అయితే ఆ పాప వాటర్ ఫాల్స్ ను చూసేందుకు వచ్చిందని అనుకున్నారు. అయితే ఆమె కదలికల్లో అనుమానం రావడంతో..దూకొద్దని గట్టిగా అరిచారు. వారి మాటలను పట్టించుకోకుండా సరస్వతి మౌర్య నీళ్లలోకి దూకేసింది. దీంతో వెంటనే స్థానికులు కూడా నీళ్లలోకి దూకి సరస్వతి మౌర్యను రక్షించారు. అయితే సరస్వతి మౌర్య జలపాతం దగ్గరకు రావడం...నీళ్లలోకి దూకడాన్ని  స్థానికులు  వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అయింది. 
సరస్వతి మౌర్యను కాపాడిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలికను  పోలీసులు  ఆమె కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకెళ్లారు. 

చిత్రకోట్ జలపాతం అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడి జలపాతాలను చూస్తుంటే పాలధారలే  దివి నుంచి భువికి  జాలు వారుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ జలపాతం అందాలను చూసేందుకు నిత్యం పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.  ఇంద్రావతి నదిపై ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ను  ఇండియా నయాగరా ఫాల్స్‌ గా పిలుస్తారు.  ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగ్దల్‌పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్‌ఫాల్స్ ఉంటాయి.