గాల్లో ఉండగా విమానంలో చిన్నారికి గాయాలు.. ఎలాగంటే

గాల్లో ఉండగా విమానంలో చిన్నారికి గాయాలు.. ఎలాగంటే

ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్‌ చాక్లెట్‌ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

విమానంలో సిబ్బంది నిర్లక్యం ఓ చిన్నారికి గాయాన్ని చేసింది. హాట్ చాక్లెట్ చల్లడం వల్ల పదేళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఆగస్టు 11న ఢిల్లీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై ఆ ఎయిర్ లైన్స్ సంస్థ, సిబ్బంది కనీసం క్షమాణలు చెప్పలేదని, వైద్య ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆ బాలిక తల్లి ఆరోపించింది.   ఢిల్లీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో రచనా గుప్తా అనే మహిళ తన పదేళ్ల కూతురు తారాతో కలిసి ప్రయాణిస్తోంది. అయితే తారా తనకు హాటా చాక్లెట్ కావాలని కోరడంతో ఎయిర్ హోస్టెస్ దానిని తీసుకొచ్చింది. అయితే అది అందించే క్రమంలో వేడి పానీయం చిమ్మడం వల్ల చిన్నారికి కాలిన గాయాలు అయ్యాయి. తరువాత పారామెడికల్ సిబ్బంది ఆ పాపకు తక్షణ ప్రథమ చికిత్స అందించారు. విమానం ల్యాండ్ అయిన తరువాత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కానీ జరిగిన తప్పిదానికి విస్తారా ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పలేదని గుప్తా ఆరోపిస్తుంది. 

తరువాత తల్లీ కూతుర్లు ఇద్దరే ఆ అంబులెన్స్ లో హాస్పిటల్ కు వెళ్లారని గుప్తా తెలిపారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ట్రీట్ మెంట్ అందించారు. 503 యూరోల అంబులెన్స్ బిల్లుతో పాటు  ట్రీట్మెంట్ ఖర్చును వారే సొంతంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎయిర్ లైన్స్ ఎలాంటి సాహాయాన్ని అందించలేదు. ఈ ఘటన వల్ల వారు  లిస్బన్ కు కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయింది. 

ఈ ఘటనను వివరిస్తూ రచనా గుప్తా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. విస్తారా ఎయిర్ లైన్స్ లో తన కూతురుకు ఎదురైన బాధకరమైన అనుభవం, సిబ్బంది వ్యహరించిన తీరును అందులో పేర్కొన్నారు. తన స్నేహితుడు విమానాశ్రాయనికి 3 సార్లు వెళ్లాడని, 4-5 గంటలు ఎదరుచూసి లగేజీ తీసుకువచ్చారని ఆమె అందులో తెలిపారు. విస్తారా ఎయిర్ హోస్టెస్, కెప్టెన్, సిబ్బంది ఎవరూ తమకు క్షమాపణలు చెప్పలేదని పేర్కొన్నారు. 

కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా.. తమకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి విమానయాన సంస్థ ప్రయత్నాలు చేయలేదని ఆమె ఆరోపించారు. అయితే ఈ పోస్టు తరువాత ఎయిర్ లైన్స్ ఆమెను సంప్రదించింది. తరువాత దీనిపై విస్తారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తల్లీకూతుర్లు భారత్ కు తిరిగి వచ్చేందుకు ఇప్పటికే వెసులుబాటు కల్పించామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. బాధితురాలి చికిత్స కోసం అయిన వైద్య ఖర్చులను కూడా భరిస్తామని ప్రకటించింది. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపింది.  ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంది.