పండుగ రోజు​ గిద్దా డాన్స్​​

పండుగ రోజు​ గిద్దా డాన్స్​​

పంజాబీ జానపద నృత్యాల్లో భాంగ్రా అందరికీ తెలుసు. మగవాళ్లు హుషారైన ఫోక్​సాంగ్స్​ పాడుతూ డాన్స్​ పర్ఫార్మ్​ చేస్తారు. ఇందులో ఆడవాళ్లకు ఇంపార్టెన్స్​ తక్కువ. దీనికి కౌంటర్​ ప్లేగా ఆడేదే గిద్దా డాన్స్ అని చెప్తారు​. ఇది పూర్తి లేడీస్​ స్పెషల్​.  పంజాబీల కల్చర్​లో ఈ డాన్స్​ కూడా ఒక భాగం. షైనీ బ్రైట్​ కలర్​ సల్వార్​ కమీజ్, కుర్తీ విత్​ షరారా, పలాజోలు లాంటివి వేసుకుని గిద్దా డాన్స్​ చేస్తారు పంజాబీ లేడీస్​. ఈ డాన్స్​ ఫుల్​ జోష్​తోఉంటుంది. డాన్స్​ వేసేవాళ్లంతా ఒక సర్కిల్​లా నిల్చోవాలి. పాటలో లిరిక్స్​ వరుసలు ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ ఆట కొనసాగిస్తారు. పాట పాడేవాళ్లు తర్వాతి లైన్​ను ఇంకొకరికి కంటిన్యూ చేసి పాడమని పాయింటవుట్​ చేయడం కూడా ఉంటుంది. మధ్యలో ఒకరు లీడ్​ చేస్తుంటారు. 

బతుకమ్మ తరహాలో ఎంతమందైనా కలిసి ఆడుకోవచ్చు. డాన్స్​లో కొన్ని స్టెప్​ స్టయిల్స్​ ఉంటాయి. వరుస మారేటప్పుడు స్టెప్​ స్టయిల్​ కూడా మారుస్తారు. ఈ పాటల్లో ఫెమినిజం కనిపిస్తుంది. ఫ్యామిలీ, మ్యారేజ్​, రిలేషన్​షిప్​, లైఫ్​ వంటి టాపిక్స్​ మీద పాటలు పాడతారు. భాంగ్రాకి మధ్యలో డోలు పట్టుకుని పాడతారు. కానీ గిద్దాలో మాత్రం చప్పట్లు కొడుతూ పాడతారు. ఎనర్జీ లెవల్స్​లో భాంగ్రా కంటే గిద్దానే పవర్​ఫుల్​. సంక్రాంతి అంటే ఎలాగూ ట్రెడిషనల్​ డ్రెస్​లు ఉంటాయి. ఫ్యామిలీ లేడీస్​ అంతా  కొత్తగా ఏదన్నా చేయాలంటే, యూట్యూబ్​లో గిద్దా డాన్స్​ వీడియోలు చూసి వెరైటీగా ట్రై చేయొచ్చు.