ఆటిజం మీద అవేర్​నెస్​ ఇచ్చిన్రు

ఆటిజం మీద అవేర్​నెస్​ ఇచ్చిన్రు

మన దేశంలో ప్రతి ఐదొందల మందిలో ఒకరికి ఆటిజం లక్షణాలు​ ఉన్నాయి. అంటే మనదేశంలో దాదాపు మూడు మిలియన్ల మంది ఆటిజం స్పెక్ట్రమ్​ డిజార్డర్​తో బాధపడుతున్నారు. ఇవి కనిపించే లెక్కలు మాత్రమే. అయితే పిల్లల్లో దీన్ని ముందుగానే గుర్తిస్తే.. వాటికి సంబంధించిన సమస్యల్ని వాళ్లు ఈజీగా దాటగలుగుతారు. అందుకు కావాల్సింది పేరెంట్స్​లో, సొసైటీలో ఆటిజంపై అవేర్​నెస్​. దానికోసం ఓ అడుగు వేశారు హైదరాబాద్​లోని ‘విహార మెడికేర్’​ హాస్పిటల్ డైరెక్టర్స్​​ అర్చనా డిడిగె, డాక్టర్ మనీష్​​ గౌర్​​. వరల్డ్​ ఆటిజం అవేర్​నెస్​ మంత్​ సందర్భంగా ఈ నెలంతా స్కూల్స్​, కాలేజీల్లో ఆటిజంపై అవేర్​నెస్​ కల్పించారు వీళ్లు.

ఆటిజంని ఒక జబ్బుగా చూస్తుంటారు చాలామంది. కానీ, ఇదొక న్యూరలాజికల్​ డిజార్డర్​. జన్యుపరమైన కారణాలు, ఇమ్యూనిటీ లోపాలు..ఇలా మరెన్నో రీజన్స్​ వల్ల వస్తుంది. అయితే పిల్లల్లో దీన్ని మొదటి స్టేజ్​లోనే గుర్తించి ట్రీట్మెంట్​ ఇప్పిస్తే... వాళ్లు ఆ సమస్య నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. కానీ, పిల్లల్లో ఆటిజంని గుర్తించడంలో చాలామంది తల్లిదండ్రులు ఫెయిలవుతున్నారు. దాంతో పరిస్థితి చేయి దాటుతోంది. అందుకే ఆటిజంపై వీలైనంత ఎక్కువమందికి అవేర్​నెస్​ కల్పించాలి అనుకుంది విహార​ మెడికేర్​ టీమ్​. ఆ ప్రయత్నమే ఈ అవేర్​నెస్​ పాఠాలు. 

ఆటిజం గుర్తించడం ఎలా? 
సాధారణంగా మూడు నెలల వయసు నుంచే పిల్లలు తల్లిని గుర్తుపడతారు. ఆరు నెలల వచ్చేసరికి సైగల్ని అర్థం చేసుకుంటారు. ఏడాదికి వాళ్ల భాషలో కమ్యూనికేట్​ చేసేందుకు ట్రై చేస్తుంటారు. మూడేండ్ల లోపే మాట్లాడటం కూడా మొదలుపెడతారు. కానీ, ఆటిజం ఉన్న పిల్లల్లో ఇవేం కనిపించవు. వాళ్ల చూపు, వినికిడి బాగానే ఉంటుంది. కానీ, సరిగా ఐ– కాంటాక్ట్​ ఇవ్వలేకపోతారు. పేరు పెట్టి పిలిచినా రెస్పాండ్ అవ్వరు. సరిగా మాట్లాడలేరు. వాళ్ల ఎమోషన్స్​ని, ఫీలింగ్స్​ని కమ్యూనికేట్​ చేయలేకపోతారు. కొందరిలో మూర్ఛ వ్యాధి కూడా ఉంటుంది. వీలైనంత త్వరగా పేరెంట్స్​ తమ పిల్లలో ఈ  లక్షణాల్ని గుర్తిస్తే ఆటిజం ట్రీట్మెంట్​ చేయడం ఈజీ అవుతుంది. ఇదే విషయాన్ని ఈ నెలంతా జరిగిన అవేర్​నెస్​ క్యాంప్​లలో  సైకాలజిస్ట్​ల సాయంతో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది విహార హాస్పిటల్స్​ టీమ్​. వీటితో పాటు ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులతో సొసైటీ ఎలా నడుచుకోవాలో కూడా అవగాహన కల్పించారు.

వాళ్లని అర్థం చేసుకోవాలి 
వాస్తవానికి ఆటిజం పిల్లలు ఏ విషయమైనా త్వరగా నేర్చుకోగలుగుతారు. అయితే సరైన పద్ధతుల్లోనే నేర్పాలి. అలాగే పేరెంట్స్​తో పాటు సొసైటీ కూడా ఈ పిల్లలకు స్కూల్స్, కాలేజీల్లో తగినంత స్పేస్​ ఇవ్వాలి. వాళ్లని అర్థం చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే అందరికీ ఆటిజం గురించి తెలియాలి. ‘‘అందుకే ఈ అవేర్​నెస్​ సెషన్స్​ కండక్ట్​ చేశాం. నెల రోజులపాటు జరిగిన ఈ అవేర్​నెస్​ క్యాంప్​కి మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఫ్యూచర్​లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి అనుకుంటున్నాం’’ అంటోంది విహార మెడికేర్​ టీమ్​. 

నాలుగు రకాలు
పిల్లలు సరిగా మాట్లాడలేకపోవడం, కమ్యూనికేషన్​​ లోపం, నలుగురిలో కలవలేక పోవడం లాంటి లక్షణాలన్నీ ఆటిజం స్పెక్ట్రమ్​ డిజార్డర్​ కిందకి వస్తాయి. ఇందులో నాలుగు రకాలున్నాయి.. వాటి గురించి కూడా​ అవేర్​నెస్​ కల్పించింది విహార​ మెడికేర్​ హాస్పిటల్​. 

ఆస్పెర్గర్స్​​ సిండ్రోమ్​ : ఆటిజం స్పెక్ట్రమ్​లో ఆస్పెర్గర్స్​​ సిండ్రోమ్  ఒకటి. ఇది చాలా మైల్డ్ ఆటిజం. దీని బారిన పడ్డ పిల్లలు సాధారణ పిల్లల్లానే ఉంటారు. వాళ్లంతట వాళ్లే అన్ని పనులు చేసుకుంటారు. వీళ్లకి ఐక్యూ లెవల్స్​ చాలా ఎక్కువ. ఫోకస్​ కూడా బాగా ఉంటుంది. కానీ, నలుగురితో కలవరు.

పర్వేసివ్​  డెవలప్​మెంటల్​ డిజార్డర్​ : ఈ డిజార్డర్​ బారిన పడినవాళ్లలో ఆటిజం లక్షణాలన్నీ ఉంటాయి. కానీ, అవన్నీ కాస్త ఆలస్యంగా బయటపడతాయి. అయితే ఆటిజం వాళ్లలో ఉండేంత పట్టుదల వీళ్లలో కనిపించదు. 

ఆటిస్టిక్ డిజార్డర్ ​: ఆస్పెర్గర్స్​​, పర్వేసివ్​ డెవలప్​మెంట్ డిజార్డర్​ సింప్టమ్స్​ అన్నీ ఆటిస్టిక్ డిజార్డర్​లో ఉంటాయి. అయితే ఆ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆటిస్టిక్ డిజార్డర్​లో. 

చైల్డ్​హుడ్​ డిస్​ఇంటిగ్రేటివ్​ డిజార్డర్​ : ఆటిజం స్పెక్ట్రమ్​లో చాలా రేర్​ డిజార్డర్​ ఇది. దీని బారిన పడ్డవాళ్లు  నలుగురితో కలవరు. పదాలు పలకవు. బ్రెయిన్​ డెవలప్​మెంట్ సరిగా ఉండదు.