
ఈ దుర్భర జీవితం గడపలేను .. కాస్త విషమిప్పించండి అంటూ కన్నడ స్టార్ హీరో దర్శన్ బోరును విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. నెలవారీ హియరింగ్ లో భాగంగా మంగళవారం జైలు నుంచే 57వ అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెల్లో ఉండలేకపోతున్నాను, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయమూర్తి ముందు విలపించారు..
నేను సూర్యరశ్మిని చూసి నెల రోజులకు పైగా అయింది. నా చేతులకు ఫంగస్ కూడా సోకింది. బట్టలు కంపు కోడుతున్నాయి. ఇంత దుర్భరమైన బతుకు నేను బతకలేను అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు దర్శన్. నా జీవితం చాలా దారుణంగా తయారైంది.. ఇలా నేను బతకలేను.. ఒక చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా అంటూ విలపించారు.
దీనిపై స్పందించిన జడ్జి.. కోర్టులో ఇలాంటివి మీరు అడగకూడదని దర్శన్ కు సూచించారు. దర్శన్ ఆరోగ్య సమస్యలు, జీవన పరిస్థితులకు సంబంధించి జైలు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. మరోవైపు తలగడ, బెడ్ షీట్, ఇంటి నుంచి ఆహారానికి అనుమతి ఇవ్వాలని జడ్జిని దర్శన్ కోరారు.
తన గ్లర్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు తన అభిమాని రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపిస్తున్నాడంటూ .. అతనిని హత్య చేయించారు హీరో దర్శన్. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్ . . బెంగళూరులో ఓ షెడ్ లో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. తర్వాత రేణుస్వామి మృతదేహం ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు దర్శన్ తో పాటు పవిత్రను గతేడాది జూన్ లో అరెస్ట్ చేశారు.
అయితే గతేడాది డిసెంబర్ లో కర్ణాటక హైకోర్టు దర్శన్ కు బెయిల్ మంజూరు చేసింది. కానీ సుప్రీం కోర్టు ఆ బెయిల్ ను రద్దు చేసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అతడి బెయిల్ డిస్మిస్ చేసింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తనకు జైల్లో దారుణమైన దుర్భర జీవితం గడుపుతున్నాడని బోరున ఏడ్చేశారు.