
- రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించే స్టడీపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బీసీ జనాభా పరిస్థితులపై స్టడీకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈ విధంగా చేసేందుకు తీసుకునే చర్యలు వివరించాలని కోరింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 5ను రద్దు చేయాలని జూజుల శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ల పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది.