డెర్మటాలజిస్ట్‌‌  ప్రిస్క్రిప్షన్లలో గ్లెన్‌‌మార్క్ హవా

డెర్మటాలజిస్ట్‌‌  ప్రిస్క్రిప్షన్లలో గ్లెన్‌‌మార్క్ హవా

హైదరాబాద్​, వెలుగు: స్కిన్​కేర్ ​ప్రొడక్టులు,  డెర్మా థెరపీల్లో గ్లెన్​మార్క్​ నంబర్ వన్​ స్థానంలో ఉంది. ఐక్యూవీఐఏ మెడికల్​ ఆడిట్​ ఆధారంగా తయారు చేసిన డేటా ప్రకారం గ్లెన్​మార్క్​కు ఈ గుర్తింపు వచ్చింది. జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు ఉన్న  ప్రిస్క్రిప్షన్ లెక్కల ఆధారంగా డేటా తయారు చేశారు.

గ్లెన్‌‌మార్క్ డెర్మటాలజీ పోర్ట్‌‌ఫోలియోలో ఎపిసాఫ్ట్, క్యాండిడ్ డస్టింగ్ పౌడర్, మోమేట్, క్యాండిట్రల్ ఎస్‌‌బి, లా షీల్డ్, స్కాల్ప్ ప్లస్​, టాక్రోజ్ ఆయింట్‌‌మెంట్ మొదలైనవి ఉన్నాయి.   డెర్మటాలజీ విభాగంలో 9.9 శాతం వృద్ధిని,  7.49 శాతం మార్కెట్ వాటాను సాధించింది.