SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్

SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్

ఐపీఎల్ నేడు హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లుండడంతో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో దాదాపు ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే సన్ రైజర్స్ మాత్రం ఒక కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. 

విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ అదరగొడుతుంటే.. కమ్మిన్స్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. అయితే జట్టులో మరో విదేశీ ఆటగాడు మార్కరం మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. దీంతో నేడు మార్కరం స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం రావొచ్చు. ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గతేడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. ఈ కారణంగానే విశ్రాంతి పేరుతో మార్కరంను పక్కన పెట్టొచ్చు. 

also read : హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. మరోవైపు బెంగళూరు ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటికే టోర్నీలో 250 పరుగులకు పైగా మూడు సార్లు కొట్టేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీపై మొదట బ్యాటింగ్ చేస్తే 300 కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా అభిమానులకు ఈ మ్యాచ్ లో ఫుల్ కిక్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది.