హనుమాన్‌‌‌‌‌‌‌‌ జయంతికి రామాయణ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌

హనుమాన్‌‌‌‌‌‌‌‌ జయంతికి రామాయణ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌

భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం మరోసారి వెండితెరపై ఆవిష్కృతమవుతోంది.  నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రం రూపొందుతోంది.  రాముడిగా రణబీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌‌‌‌‌‌‌‌ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ హిందీ చిత్రాన్ని నితేశ్‌‌‌‌‌‌‌‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. 

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ గురించి అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు మేకర్స్‌‌‌‌‌‌‌‌. హనుమాన్‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 2న ‘రామ’ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌ వేడుకను గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.  ఇందులో సన్నీ డియోల్ హనుమంతునిగా,  రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.