3 లక్షలు దాటిన కరోనా మరణాలు

3 లక్షలు దాటిన కరోనా మరణాలు
  • 16.88 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి
  • కేసుల్లో చైనాకు దగ్గరగా ఇండియా
  • దేశంలో 81,987 మందికి సోకిన వైరస్​
  • 2,649 మంది బలి.. 27,956 మంది రికవర్​
  • మహారాష్ట్రలో వెయ్యి దాటిన మరణాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా కలవరపెడుతూనే ఉంది. ప్రపంచ దేశాలు లాక్​డౌన్​లో సడలింపులు ఇస్తున్న టైంలోనే కేసులు, మరణాలు ఎక్కువైతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 3 లక్షల మార్కును దాటింది. మొత్తంగా 3,03,345 మంది మహమ్మారికి బలయ్యారు. 45,24,856 మంది దాని బారిన పడ్డారు. ఇప్పటిదాకా 17,03,742 మంది కోలుకున్నారు. అయితే, మరణాలు ఎక్కువగా అమెరికా, బ్రిటన్​, ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​, బ్రెజిల్​లోనే చనిపోయారు. ఈ ఆరు దేశాల్లోనే 2,18,923 మంది చనిపోయారు. మొత్తం మరణాల్లో ఆయా దేశాల వాటానే 72.7 శాతం అంటే అక్కడ పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఎక్కువగా 86,912 మంది చనిపోయారు. 14,57,593 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత బ్రిటన్​లో 33,614 మంది చనిపోగా, ఇటలీలో 31,368 మంది బలయ్యారు.

దేశంలో ఒక్కరోజే 3,930 మందికి

కరోనా కేసుల సంఖ్యలో చైనాకు ఇండియా దగ్గరవుతోంది. గురువారం ఒక్కరోజే 3,930 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,987కి పెరిగింది. 2,649 మంది చనిపోయారు. ఆస్పత్రుల నుంచి గురువారం 1,539 మంది డిశ్చార్జికాగా, ఆ సంఖ్య 27,956కి చేరింది. 51,377 మంది ఇంకా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో రోజూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ గురువారం ఒక్కరోజే 1,602 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 27,524కు చేరింది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర వాటానే 33.5 శాతం కాగా, ఒక్క ముంబై వాటానే 20 శాతం. ఆ సిటీలో 16,738 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాలూ వెయ్యి దాటాయి. దీంతో వెయ్యి మరణాలు దాటిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. మొత్తంగా 1,019 మంది చనిపోయారు.

బయటి నుంచి వచ్చేటోళ్లకు పూల్ టెస్టులు